రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి రాజాం వస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం పొగిరి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న డి.శశిభూషణ్, కె.మంగలతో పాటు మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


