భామిని: మండలంలోని బిల్లుమడ పంట పొలాల్లో ఏనుగులు గుంపు ప్రవేశించింది. బిల్లుమడ – నేరడి మధ్య మొక్కజొన్న పొలాల్లో ఏనుగులు ప్రవేశించి ధ్వంసం చేశాయి. ఆహారం కోసం పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట సమీపంలోని వంశధార నదిలో దిగి జలకాలాడుతున్నాయి.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి రైల్వే పట్టాలను దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి బొబ్బిలి జీఆర్‌పీ హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన ఈర్లి శ్రీరాములు(55) గరుడుబిల్లి వద్ద రైలు ట్రాకును దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
అండర్– 19 క్రికెట్ జట్టు
ఎంపికలు రేపు
విజయనగరం: అండర్ – 19 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 29న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రం శివారు బాబామెట్ట విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్ తీసుకు రావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని తెలిపారు.
సాలూరు: పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసా ద్, సీఐ అప్పలనాయుడు తదితరుల ఆధ్వర్యంలో బస్సుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి సాలూరు మీదుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాల లభ్య త, అత్యవసర ద్వారాల పనితీరును అధికారులు తనిఖీ చేశారు. బస్సుల పర్మిట్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికె ట్లు, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు డ్రైవర్ల లైసెన్సుల ను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. బస్సు ల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అక్రమంగా సరుకు రవాణా తదితర అంశాలపై పోలీస్‌లు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట గ్రా మ కళ్లాల్లో పశువుల మేత కోసం ఉంచిన వరి గడ్డికుప్పలు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమా దంలో దగ్ధమయ్యాయి. డి.కృష్ణంనాయుడు, పి.గోపినాయుడు, ఆర్లి గోపినాయుడుకు చెంది న గడ్డికుప్పలు కాలిపోయాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గడ్డికుప్పల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.


