మాకూ చలివేస్తోంది...
మనుషులనే కాదు మూగజీవాలను చలి వణికిస్తోంది. వెచ్చదనం కోసం అన్ని జీవులూ పాకులాడుతున్నాయి. దీనికి బొబ్బిలి పట్టణంలోని సీబీఎం బాలికల హైస్కూల్ వద్ద శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే నిదర్శనం. ఇక్కడ రోడ్డుకిరువైపులా ఆకు కూరలు, కూరగాయలమ్మే విక్రయదారులు సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అక్కడి చెత్తను తగులబెడతారు. వారు కొద్దిసేపు చలికాచుకున్నాక ఇళ్లకు వెళ్లిపోతారు. అంతవరకూ రోడ్డుపై సంచరించే ఆవులన్నీ మంట వద్దకు వెళ్లి ఇలా వెచ్చదనం పొందుతాయి. మాకూ చలి ఉందనే సంకేతాన్నిస్తున్నాయి.
– బొబ్బిలి


