1180 బూతుల్లో పల్స్‌పోలియో కార్యక్రమం
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని 1185 బూతుల్లో ఈ నెల 21న ఆదివారం పల్స్‌పోలియో నివారణకు చుక్కలమందు వేస్తామని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అప్పుడేపుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటిచిందన్నారు. అయినప్పటకి కొన్ని దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 1999లో చివరి సారిగా జిల్లాలో రెండు పోలియో కేసులు కర్లాం, ముంజేరులో నమోదయ్యాయన్నారు. జిల్లాలో 2,45,667 ఓపీవీ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశామన్నారు. చుక్కల మందు వేసేందుకు 2,360 బృందాలు, 129 మంది సూపర్ వైజర్లు, 66 మొబైల్ టీమ్‌లు, 21 ట్రాన్సిట్ టీములు, 56 కోల్డ్ చైన్ టీమ్‌లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో డీఐఓ అచ్చుతకుమారి, డీఎల్‌ఓ కె.రాణి పాల్గొన్నారు.
1180 బూతుల్లో పల్స్‌పోలియో కార్యక్రమం


