● చంద్రన్నా... ఎరువు ఏదన్నా..?
మెరకముడిదాం: గర్భాం రైతుసేవా కేంద్రం వద్ద బస్తా యూరియా కోసం బారులు తీరిన రైతులు
నెల్లిమర్ల రూరల్: వల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల క్యూ
రైతన్నను రబీలోనూ ఎరువు కష్టాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న, కూరగాయల పంటలకు వేసేందుకు అవసరమైన యూరియా లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తా యూరియా కోసం ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. భూమి పత్రాలు, ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ కడుతున్నారు. యూరియా కోసం గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోలేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విత్తనం నుంచి పంట అమ్ముకునేవరకు కష్టాల నడుమ ‘సాగు’తున్నామంటూ రైతులు వాపోయారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు, మెరకముడిదాం మండలంలోని గర్భాం ఆర్‌ఎస్‌కేల వద్ద బస్తా యూరియా కోసం శుక్రవారం గంటల తరబడి నిరీక్షించారు. చాలామంది రైతులకు ఎరువు
అందక నిరాశతో వెనుదిరిగారు.
– నెల్లిమర్ల రూరల్/మెరకముడిదాం
● చంద్రన్నా... ఎరువు ఏదన్నా..?


