ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూషతో పాటు నాలుగు మండలాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న చేపట్టే వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అమలుచేయలేదన్నారు. పింఛన్లు, ఫీజురీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇలా.. ఏ పథకమూ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. 18 నెలల పాలనలో అప్పులు మినహా సంక్షేమపాలన కనిపించడంలేదన్నారు. నాయకులతో మాట్లాడి గ్రామాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో మీసాల విశ్వేశ్వరరావు, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, కోట్ల విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


