రైస్ మిల్లులకు నోటీసులు జారీ
విజయనగరం ఫోర్ట్: మిల్లర్లు అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నారంటూ రైతుల ఆవేదనను ఈ నెల 13న ‘రైతు కష్టం మిల్లర్ల పాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై పౌరసరఫరాల సంస్థ అధికారులు స్పందించారు. రైతుల నుంచి అదనపు ధాన్యం డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన మిల్లర్లకు శుక్రవారం నోటీసులు జారీచేశారు. గంట్యాడ మండలం రావివలస వద్ద ఉన్న కనకదుర్గ రైస్ మిల్లు, చీపురుపల్లిలోని శ్రీకేవీఆర్ ఇండస్ట్రీ, కింతలిపేటలోని కేవీఆర్ వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్లు, కలవరాయిలోని శ్రీలక్ష్మి సంతోషిమాత రైస్ మిల్లు, గొల్లపల్లిలోని శ్రీవిజయలక్ష్మి రైస్ మిల్లు, బొబ్బిలిలోని శ్రీ సాయి వెంకట కామేశ్వరి రైస్ మిల్లు, తెర్లాంలోని శ్రీ ఉమామహేశ్వరి రైస్ మిల్లుకు నోటీసులు జారీ చేసినట్టు సివిల్ సప్‌లై జిల్లా మేనేజర్ బి.శాంతి తెలిపారు.
జిల్లాలో 29 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు 29 నమోదైనట్టు డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనకుమారి తెలిపారు. 194 మందిని పరీక్షించగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. పీహెచ్‌సీల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ల్యాబ్‌లో ఎలిజా టెస్టు ద్వారా నిర్ధారిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాధి సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారన్నారు.
రైస్ మిల్లులకు నోటీసులు జారీ


