కొఠియా ఒడిశాదే..
● వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒడిశా మంత్రి
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఉన్న వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాలకు ఒడిశాయే తల్లి అని, ఆంధ్రా పిన్ని వంటిదంటూ ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొఠియా ఎప్పటికీ ఒడిశాదేనంటూ నమ్మబలికారు. కొఠియాలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 31 మంది మహిళా సంఘాల సభ్యులకు ఒడిశా ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయల రుణం, రైతులకు బఠానీ విత్తనాలు అందజేశారు. రూ.2లక్షల16 వేలు విలువైన బ్రాయిలర్ ఫాం యూనిట్‌ను మంజూరు చేశారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్, పొట్టంగి, కొరాపుట్, కోట్‌పాడ్ ఎమ్మెల్యేలు రామచంద్ర కదమ్, రఘరామ్ మాచ్, రూపు భత్రా, భద్రతా అధికారి రోహిత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.


