రోడ్డుపై పడి మహిళ మృతి
బొబ్బిలి: మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక గొల్లపల్లి ఆటో స్టాండ్ వద్ద ఓ మహిళ రోడ్డుపై పడిపోగా తలకు దెబ్బతగిలి రక్తం ధారగా కారుతోంది. నోట్లోంచి కూడా రక్తం వస్తోంది. అంతలో అటుగా వెళ్తున్న ఎస్సై ఆర్.రమేష్ కుమార్ ఆ మహిళ స్థితి చూసి పరిశీలించి వెంటనే 108కి సమాచారమందించారు. కానీ సమయానికి 108 రాలేదు. దీంతో తానే ఓ ఆటో మాట్లాడి స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే మృతి చెందిందని చెప్పగా అయ్యో అంటూ నిరుత్సాహం చెందారు. చివరకు ఆమె గురించి ఆరా తీయగా యాదవ వీధికి చెందిన బొట్ట ఆదెమ్మ(70)అని తేలింది. గొల్లపల్లిలోని యూహెచ్‌సీకి ఆరోగ్య చికిత్స కోసం వచ్చిందని, అట్నుంచి వస్తుండగా బీపీ పెరిగి పడిపోయి ఉండొచ్చని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు.


