
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
కొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో శుక్రవారం రాత్రి స్కూటీపై వెళ్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో లక్కవరపుకోట మండలం భూమిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాదాబత్తుల శ్రీను(23) అక్కడికక్కడే మృతి చెందగా అదే గ్రామానికి చెందిన ధనాలకోటి అప్పలనాయుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై హేమంత్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీను తన స్వంత గ్రామం భూమిరెడ్డిపాలెం నుంచి స్నేహితుడు అప్పలనాయుడితో కలిసి స్కూటీపై పెందుర్తి మండలంలో గల తన అక్క ఇంటికి బయల్దేరాడు. అరకు–విశాఖ రోడ్డు మంగళపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా మితిమీరిన వేగంతో గుర్తు తెలియిన వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో శ్రీను రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధికంగా రక్తస్రావం జరగ్గా అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనుక కూర్చున్న అప్పలనాయుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా మృతుడు శ్రీను విశాఖపట్నం జిల్లా ఎన్‌ఏడీ జంక్షన్ సమీపంలో బాజీజంక్షన్ వద్ద గల బ్యాంక్ ఆఫ్ బరోడాలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అప్పలనాయుడు చిన్న చిన్న ఎలక్ట్రకల్ పనులను చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై మేమంత్‌కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించి శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మరో యువకుడికి తీవ్రగాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం