
● ఆస్పత్రిలో విద్యుత్ ఇక్కట్‌లు
చీకటిలో వైద్యసేవలందిస్తున్న సిబ్బంది... విసన కర్రలతో రోగులకు విసురుతున్న మహిళలను చూశారా.. ఇది బాడంగి సామాజిక వైద్య కేంద్రంలో తీసిన చిత్రం. శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ లైన్‌ల నిర్వహణ పనుల వల్ల ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు ఉక్కపోతతో రోగులు అవస్థలు పడగా, మరోవైపు ఎక్స్‌రే, ల్యాబ్ సేవలు,
శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీలో రోగులను పరీక్షించేందుకు వైద్యులు ఆపసోపాలు పడ్డారు. ఆస్పత్రి మొత్తం చీకటిగా మారడంతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో వైద్యసిబ్బంది సేవలందించారు. ఏడున్నర గంటల పాటు అటు వైద్యులు, సిబ్బంది, ఇటు రోగులు నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి ఇన్వెర్టర్ చార్జింగ్ అయిపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో కష్టాలు తప్పలేదు. తక్షణమే ఆస్పత్రికి జనరేటర్ సదుపాయం కల్పించాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేశారు. – బాడంగి