
● కదలని బండి... తోయాల్సిందేనండి..
రాజాం–శ్రీకాకుళం ప్రాంతాల మధ్య తిరిగే బస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొరాయించింది. స్టార్ట్ కాకపోవడంతో దాదాపు గంటకాలం పాటు కాంప్లెక్స్‌లో నిలిచిపోయింది. చేసేదిలేక ప్రయాణికులు బస్సు దిగి ఇదిగో ఇలా ముందుకు నెట్టారు. అయినా స్టార్ట్ కాకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల రాజాం– శ్రీకాకుళం, బొబ్బిలి, చీపురుపల్లి, పాలకొండ ప్రాంతాల మధ్య తిరిగే బస్సులు అధికంగా మొరాయిస్తున్నాయి. మరమ్మతులకు గురైన బస్సులను ఇటు వైపు నడపడంతో ఈ పరిస్థితి వస్తుందని, పట్టించుకునే నాయకులు లేక ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రయాణికులు వాపోయారు. – రాజాం