
నరవ మేట్‌లపై విచారణ
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నారనే అంశంపై సాక్షిలో గురువారం ఉపాధిలో బినామీ మస్తర్లు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి గంట్యాడ ఎంపీడీవో ఆర్.వి.రమణమూర్తి స్పందించారు. బినామీ మస్తర్లు వేసారన్న అభియోగాలు ఉన్న నరవ మేట్‌లను గంట్యాడ ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. బినామీ మస్తర్లు వేసిన మేట్‌లను తొలగిస్తామని ఆయన తెలిపారు.
శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు
సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు.
ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన
పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్‌ఎన్‌వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్‌ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు పాల్గొన్నారు.

నరవ మేట్‌లపై విచారణ

నరవ మేట్‌లపై విచారణ

నరవ మేట్‌లపై విచారణ