
ఆర్థిక వ్యవస్థల రూపకల్పనలో శాసీ్త్రయ ఆవిష్కరణలు కీలకం
విజయనగరం అర్బన్: ఆధునిక సమాజం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంలో శాసీ్త్రయ ఆవిష్కరణలు కీలక భూమిక పోషిస్తున్నాయని బెంగళూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఎన్‌ఐఏఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్షుమాన్ బెహరా అన్నారు. విజయనగరం గాజులరేగ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘శాసీ్త్రయ ఆవిష్కరణల సామాజిక – ఆర్థిక ప్రభావాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పరివర్తన మరియు ప్రజా విధానాలపై శాసీ్త్రయ పురోగతి, ఆర్థిక అభివృద్ధి అంశాలు ప్రభావం చూపుతాయని అన్నారు. అనంతరం ఎన్‌ఐఏఎస్, సీతం కళాశాల మధ్య భవష్యత్ విద్య, పరిశోధన సహకారాన్ని పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎన్‌ఐఏఎస్ అసోసియేట్ ప్రొఫెసర్
అన్షుమాన్ బెహరా