
జీవనోపాధి పోతుంది
ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ సరుకులను అవినీతికి తావులేకుండా ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల జీవనోపాధి పోతుంది. నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేయడం తగదు. పునరాలోచించాలి.
– ఎస్ కృష్ణ, ఎండీయూ వాహన ఆపరేటర్ల
సంఘం మండలాధ్యక్షుడు, రొంపల్లి
రోడ్డున పడతాం..
ఎండీయూ వాహనాల్లో రేషన్ సరుకులు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నాం. పేదలకు రేషన్ సరుకులు ఇస్తుంటే సంతోషంగా ఉంది. బండి ద్వారా నెలకు వచ్చిన రూ.10 వేలు ఆదాయమే కుటుంబానికి ఆధారం. మా బతుకును రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు.
– బి.గణేష్, ఎండీయూ వాహన ఆపరేటర్,
కొండకెంగువ
గిరిజనులకు కష్టాలు తప్పవు
గతంలో రేషన్ సరుకులకు సుమారు 4 కిలోమీటర్లు మేర నడుచుకుంటూ వెళ్లేవారు. ఎండీయూ వాహనాలతో నడక కష్టాలు తప్పాయి. గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. ఈ వాహనాలను రద్దు చేయడం వల్ల రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు 2019 ముందు కష్టాలే ఎదురవుతాయి.
– ఎస్.కుమారి, రావివలస పంచాయతీ సర్పంచ్

జీవనోపాధి పోతుంది

జీవనోపాధి పోతుంది