
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గత వ
విజయనగరం ఫోర్ట్:
ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కింద రూ.5వేల చొప్పున సాయం అందించేది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్న తేడా లేకుండా ఎక్కడ ప్రసవించినా సాయం అందేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసింది. ఫలితంగా ఆరోగ్య ఆసరా కింద అందించే తల్లుల సాయం నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏటా వేల మంది తల్లులు ఆరోగ్య ఆసరా కింద లబ్ధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
2024 – 25లో ఇలా..
2024 ఏప్రిల్ నెల నుంచి 2025 మార్చి మధ్యలో జిల్లాలో 20 వేల 17 మంది మహిళలు ప్రసవించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8102 మంది ప్రసవించగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,915 మంది మహిళలు ప్రసవించారు. ఆరోగ్య ఆసరా కింద వీరికి రూ.5వేలు చొప్పున రూ.10కోట్లు చెల్లించాలి. అయితే కూటమి ప్రభుత్వం దీనికి చెల్లుచీటీ పలకడంతో ఆ సాయం అందలేదు.
ఎన్టీఆర్ బేబి కిట్టు ఇస్తారట..
ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కిట్టు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆరోగ్య ఆసరా బదులు ఇది ఇచ్చేందుకు నిర్ణయించడంతో తల్లులకు చాలా వరకు ఆర్థిక ఆసరా పోయినట్టే. ఎందుకంటే కిట్టు విలువ రూ.1410 మాత్రమే ఉంటుందని సమాచారం. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకే ఇచ్చేందుకు నిర్ణయించినట్టు భోగట్టా. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. వాస్తవంగా గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవానికి ఆసక్తి చూపుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవించినా ఆరోగ్య ఆసరా కింద సాయం అందించేవారు.
నియమ నిబంధనలు రాలేదు..
ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం అందిస్తామన్న ఎన్టీఆర్ బేబి కిట్లుకు సంబంధించి ఇంకా నియమ నిబంధనలు రాలేదు. వస్తే పరిశీలించి అమలు చేస్తాం.
– డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్‌వో
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య ఆసరా కింద ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు ఇచ్చే రూ.5వేలు ఎంతో భరోసాగా ఉండేది. ప్రసవం తరువాత బాలింతల పౌష్టికాహారానికి ఇతోధికంగా సాయపడేది. దీనికి ఆరోగ్య ఆసరా ఎంతో ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆ సాయం అందకపోవడంతో పౌష్టికాహార లోపంతో తల్లుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి. బేబి కిట్టుతో బిడ్డకు తప్ప తల్లికి ఒరిగే ప్రయోజనం శూన్యం. ఇదంతా ఆలోచించకుండా కేవలం గత ప్రభుత్వ పథకాల నిలుపుదలే లక్ష్యంగా పరిపాలిస్తున్న కూటమి పాలకులు ఆ దిశగా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు బాలింతల నుంచి వినిపిస్తున్నాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రసవించిన ప్రతీ తల్లికి ఆరోగ్య ఆసరా
కింద రూ.5వేల సాయం
కూటమి సర్కార్‌లో మంగళం
రూ.1410 విలువ చేసే బేబి కిట్టు ఇస్తారట!
అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో
ప్రసవించిన వారికే..
జిల్లాలో ఏడాదికి 20 వేల వరకు ప్రసవాలు
వీటిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 12 వేల వరకు ప్రసవాలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గత వ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గత వ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత గత వ