
డీఎంహెచ్‌వో ఆకస్మిక పరిశీలన
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో జీవనరాణి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీలను పరిశీలించి శత శాతం ఈహెచ్‌ఆర్ అబా నంబరుతో ఆన్‌లైన్ చేయా లని సూచించారు. ప్రతీ ఓపీకి అవసరమైన పరీక్షను నిర్వహించాలన్నారు. ల్యాబ్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. హెచ్‌బీ టెస్ట్‌ను మెరుగుపరచాలని సూచించారు. ఐపీ వార్డును పరిశీలించి చిన్న పిల్లల వ్యాక్సిన్‌ను పరిశీలించారు. ఓపెన్ ఓవెల్ పాలసీని అనుసరిస్తున్నారా... లేదా.. అని వ్యాక్సిన్‌ను పరిశీలించారు. మెడికల్ స్టోర్‌లో బిన్ కార్డ్స్‌ను పరిశీలించారు. విటమిన్ ఏ సిరప్ తగిన మోతాదులో ఉందో.. లేదో పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి ఎం.అనిల్‌కుమార్, సిబ్బందికి సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రవల్లిక ప్రతిభ
విజయనగరం టౌన్: పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్, పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ నెల 18న నిర్వహించిన పోటీల్లో భారత్‌కు చెందిన సాయినాథ్ కళా కమిటీ, ఎస్‌కేఎస్ అకాడమీలు పాల్గొన్నాయి. జిల్లాకు చెందిన కోలక ప్రవల్లిక దుర్గాదేవీగా వివిధ భారతీయ నృత్య రీతులను ప్రదర్శించి మన్ననలు పొందారు. ఇండియన్ కాన్సులేట్‌కి చెందిన అరుజిత్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవల్లికకు నృత్య యువ ప్రతిభ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. ప్రవల్లికను పలువురు అభినందించారు.
భూసర్వేపై తస్మాత్..
● సర్వే శాఖ డీడీ కుమార్
పూసపాటిరేగ: భూసర్వేపై అప్రమత్తంగా వుండాలని సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ డిఎల్‌బిఎల్.కుమార్ అన్నారు. పూసపాటిరేగలో జరుగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. రోవర్‌తో సర్వే చేసినప్పుడు హద్దులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. బ్లాక్‌ల వారీగా సర్వే జరిగినప్పుడు వీఆర్‌వోలు, విలేజి సర్వేయర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పూసపాటిరేగ మండలం గోవిందపురంలో సర్వే పూర్తయిందని మండల సర్వేయర్ గణపతిరావు తెలియజేశారు. పూసపాటిరేగ గ్రామంలో 170 ఎకరాల వరకు సర్వే జరిగినట్టు చెప్పారు. అనంతరం తహసీల్దార్ గోవిందను కలిసి సర్వే జరుగుతున్న తీరు, ఏవైనా సమస్యలు వున్నాయా.. మొదలగు అంశాలను అడిగారు. ఆయనతో పాటు ఆర్‌ఎస్ డీటీ కల్యాణి, డీటీ రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాధురి ఉన్నారు.

డీఎంహెచ్‌వో ఆకస్మిక పరిశీలన

డీఎంహెచ్‌వో ఆకస్మిక పరిశీలన