
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్లకు నెలకు రూ.18,500 జీతం చెల్లించాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.రమణ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమాని వాటా పీఎఫ్, ఈఎస్‌ఐ యాజమాన్యమే చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్‌లు, పండగ, జాతీయ సెలవులు అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణకు అవసరమైన సెల్‌ఫోన్లు ఇచ్చి రీచార్జ్ చేయించాలన్నారు. తల్లీబిడ్డ సేవలకు అదనంగా చేస్తున్న హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనత ఉన్న గర్భిణుల సేవలకు అదనపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, ఇన్సురెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నా రు. గతంలో ఉన్న విధంగా రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషి యా, దహన సంస్కారాలకు ఖర్చులు చెల్లించాలన్నారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు, బఫర్ సిబ్బందిని నియమించాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, ట్రెజరర్ ఎం.గణేష్ ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు.