
సంకిలి చక్కెర కర్మాగారం పనిచేస్తుంది
● స్పష్టంచేసిన కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: సంకలి చక్కెర కర్మాగారం యథావిధిగా పనిచేస్తుందని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టంచేశారు. కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారాన్ని నడిపించేందుకు, సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న సంకలి ఏకై క చక్కెర కర్మాగారంలో డిసెంబర్‌లో చెరకు గానుగ ప్రారంభమై మార్చి వరకు జరుగుతుందన్నారు. చెరకు సాగును బట్టి సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్నుల వరకు చెరకు క్రషింగ్ జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్,, వ్యవసాయశాఖ జేడీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
విషాదకర ఘటన
విజయనగరం ఫోర్ట్: ద్వారపూడిలో కారు డోర్ లాక్ పడి ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు మృతిచెందడం విషాదకరమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పిల్లల మృతదేహాలకు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మార్చురీలో పోస్టు మార్టం నిర్వహించారు. అక్కడకు వెళ్లి చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట విజయనగరం జెడ్పీటీసీ సభ్యుడు కెల్ల శ్రీనివాసరావు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడిగా గంగారావు
వంగర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మరిచెర్ల గంగారావు నియమితులయ్యారు. వంగర మండలం వి.వి.ఆర్.పేటకు చెందిన గంగారావు మాస్టారు గతంలో ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా, పరోక్షంగా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషించారు. ఆయన తండ్రి మరిచెర్ల తవిటినాయుడు 1963 నుంచి ఆరు దఫాలుగా సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన భార్య మరిచెర్ల విజయలక్ష్మి సర్పంచ్‌గా, పలుమార్లు ఎంపీటీసీగా, మండల విప్‌గా, జేసీఎస్ కన్వీనర్‌గా, పీఏసీఎస్ అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేశారు. గంగారావుకు పదవి దక్కడం పట్ల ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, జెడ్పీటీసీ సభ్యురాలు కరణం రాధమ్మ, పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పదవి రావడానికి కృషిచేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
స్టార్ స్పీకర్ కాంటెస్ట్‌లో రాజుకు టైటిల్
విజయనగరం: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్– 2025లో విజయనగరానికి చెందిన కెఆర్‌కే రాజు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. భారతదేశంలో నిష్ణాతులైన ఇంపాక్ట్ స్పీకర్స్ ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించారు. ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంపనాగేశ్వరరావు, మోటివేషనల్ స్పీకర్స్ బ్రదర్ షఫీ సుధీర్, సినీ నటులు కేవీ ప్రదీప్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు రాజు తెలిపారు.

సంకిలి చక్కెర కర్మాగారం పనిచేస్తుంది

సంకిలి చక్కెర కర్మాగారం పనిచేస్తుంది

సంకిలి చక్కెర కర్మాగారం పనిచేస్తుంది