
● కంచర గెడ్డ దురాక్రమణ
ఈ చిత్రం చూశారా... ఇది పొలం అనుకుంటే పొరపాటే. బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస, నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, తదితర గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందించే కంచర గెడ్డ జలాశయం. బొబ్బిలి మండలం కాశిందొరవలస గ్రామ సమీపంలో 15 ఏళ్ల కిందట జలాశయాన్ని నిర్మించారు. దీని అభివృద్ధికి గత ప్రభుత్వం 253.05 లక్షల రూపాయలు మంజూరు చేసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టేసింది. ఇదే అదునుగా స్థానిక టీడీపీ నాయకుడు జలాశయాన్ని పడమర వైపునుంచి ఇదిగో ఇలా ఆక్రమణకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే 4 ఎకరాలు ఆక్రమించి పొలంగా మార్చేశాడు. సాగుకు సన్నద్ధమవుతున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఇదే విషయంపై తహసీల్దార్ ఎం.శ్రీను మాట్లాడుతూ ఆక్రమణపై రైతులు ఫిర్యాదు చేశారన్నారు. పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. – బొబ్బిలి రూరల్