
ఉగ్రవాది కేసులో ముమ్మర దర్యాప్తు
విజయనగరం క్రైమ్: విజయనగరం ఆబాద్ వీధికి చెందిన సీరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఎక్స్‌ప్లోజివ్ యాక్టు కింద కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ కోసం నేషనల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (ఎన్‌ఐఏ) అధికారులు ఇద్దరు సోమవారం విజయనగరం వచ్చారు. రిమాండ్‌లో ఉన్న సీరాజ్‌ను విచారణ జరిపే అంశంపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉన్న వ్యక్తిని విచారణ చేయాలంటే ఇక్కడి పోలీసులు కోర్టులో మరో పిటీషన్ వేయాలి. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉంది. ఎన్‌ఐఏకు వచ్చిన సమాచారం మేరకు నేరుగా విజయనగరం వచ్చి అనుమానితులను అదుపులోకి తీసుకున్నా ఇక్కడి పోలీసులకు చెప్పి విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ రంగంలోకి దిగారు. ఎన్‌ఐఏ అధికారులు వచ్చారన్న విషయం తెలియడంతో మీడియా బృందం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అయితే, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించారు. తాము కేవలం ఎన్‌ఐఏకి సహకరించడం తప్ప కేసు పూర్వాపరాలను వెల్లడించలేమని డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టంచేశారు.
విజయనగరానికి వచ్చిన ఎన్‌ఐఏ
అధికారులు
4 గంటలకు పైగా టుటౌన్ పోలీస్
స్టేషన్‌లో దర్యాప్తు