
● చెరువులను తలపిస్తున్న రోడ్లు
గజపతినగరం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజపతినగరం మండల కేంద్రం మెంటాడ జంక్షన్ నుంచి పురిటిపెంట ఆంజనేయ స్వామి గుడి వరకు బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అయితే పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో శనివారం కురిసిన వర్షానికి రోడ్డంతా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. రహదారి మరమ్మతులపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ జేఈ అజయ్ వద్ద ప్రస్తావించగా.. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపై నీరు నిలిచిపోతోందని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే గజపతినగరం నుంచి మెంటాడ వరకు నాలుగన్నర కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.