
● ఇలా ఉంటే రోగాలు రావా..
పాలన మారింది. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. ప్రజల ‘సంక్షేమ’మే కాదు.. ప్రజారోగ్యాన్ని పట్టించుకునేవారు కూడా కరువయ్యారు. కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణంలో జాప్యం పలు కాలనీలకు శాపంగా మారింది. ఇళ్లను మురుగునీరు చుట్టుముడుతోంది. వీధి కుళాయిలు సైతం మురుగునీటిలోనే దర్శనమిస్తూ ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యమే. పనులు చేసేందుకు నిధులు లేవని, తాము ఏమీ చేయలేమన్న సమాధానమే వినిపిస్తోందన్నది స్థానికుల మాట. పారిశుద్ధ్య, మురుగునీటి సమస్యలకు రాజాం మున్సిపాలిటీ కొండంపేటలోని ఓ వీధి, గంట్యాడ మండలం రామవరం గ్రామంలో కుళాయిల దుస్థితే నిలువెత్తు నిదర్శనం. – రాజాం సిటీ/గంట్యాడ

● ఇలా ఉంటే రోగాలు రావా..