
● పూడుకుపోయిన పాల్తేరు కాలువ
చిత్రంలో తుప్పలు, పూడికలతో నిండినది పాల్తేరు చానల్. సుమారు 3వేల ఎకరాల ఆయకట్టుకు వేగావతి నది నీటిని మళ్లించేందుకు ఈ కాలువే ఆధారం. పారాది నుంచి గొల్లాది, భీమవరం, ముగడ, పాల్తేరు, ఆళ్లవానివలస, ఆనవరం, పినపెంకి, రేజేరు గ్రామాల వరకు కాలువ విస్తరించి ఉంది. ఇది ఇప్పుడు పూడికలతో నిండిపోవడంతో సాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. శివారు భూములకు సాగునీరు అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక పాలకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నది వారి వాదన. ఖరీఫ్ సమయం ముంచుకొస్తోందని, తక్షణమే కాలువ పనులు చేపట్టాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం రైతన్నల్లో ఆవేదన నింపుతోంది. పాచిపెంట పెద్దగెడ్డ నుంచి డొంకినవలస మెట్టభూములకు, రామభద్రాపురం ఏడొంపులగెడ్డ
నుంచి నాయుడువలస మీదుగా కాలువ ఏర్పాటుచేసి సాగునీటి కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యే బేబీనాయనకు విజ్ఞప్తిచేసినా స్పందన లేదని రైతులు వాపోతున్నారు. – బాడంగి