
డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం పెట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. కోట కూడలి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వంతో పోరాడి డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు. ఏడేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదలైందని, తెలంగాణా వలే ఇక్కడ కూడా అర్హత వయస్సు 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వరరావు, శ్రీను, కిశోర్, హరి, రవి పాల్గొన్నారు.

డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట