
కన్వర్షన్‌కు దరఖాస్తులు రాలేదు..
తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతోంది. మండలంలోని ఆరికతోటలో ఓ వెంచర్‌కు మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు వచ్చింది. మిగిలినవి ఏవీ రాలేదు. చెరువులు, సాగునీటి కాలువలు ఆక్రమించి వెంచర్లు వేసినా, రోడ్లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. బూసాయవలస ఎర్రన్న చెరువు సాగునీటి కాలువ పూడ్చేసినట్టు నా దృష్టికి రాలేదు. ఇరిగేషన్ అధికారులకు లెటర్ రాసి, పరిశీలిస్తాం. ఆక్రమణలు తొలగిస్తాం. ప్లాట్లు కొనుగోలుదారులు ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లలో కొనుగోలు చేయడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించకపోతే కొనుగోలు దారులు చెల్లించాల్సి వస్తుంది.
– ఎ.సులోచనరాణి,
తహసీల్దార్, రామభద్రపురం