
ధాన్యం రైతు కన్నీరు
విజయనగరం ఫోర్ట్:
ఓ వైపు అకాల వర్షాలు.. మరోవైపు చేతికందిన పంట కొనుగోలు చేసేవారు లేక ధాన్యం రైతు కన్నీరుపెడుతున్నాడు. రబీలో అష్టకష్టాలు పడి వరి పంటను సాగుచేశారు. పంట చేతికొచ్చింది. నూర్పిడి చేసిన ధాన్యం అమ్ముదామంటే కనీసం కొనుగోలు కేంద్రాలు లేవు. వ్యవసాయ, సివిల్‌సప్లై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్న సమాధానమే వినిపిస్తోంది. పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు క్వింటా వద్ద రూ.400 నష్టపోయి రూ.1870కు విక్రయిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెబుతున్న కూటమి సర్కారుకు ధాన్యం రైతుల దయనీయ పరిస్థితి పట్టడంలేదని విమర్శిస్తున్నారు.
● రబీలో 2,200 ఎకరాల్లో వరి సాగు
రబీ సీజన్‌లో జిల్లాలో 2,200 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటిలో ఒక్క గింజ కూడా కూటమి సర్కారు కొనుగోలు చేయలేదు. ఫలితం రైతుకు మద్దతు ధర లభించలేదు.

ధాన్యం రైతు కన్నీరు