
పోలిపల్లి పైడితల్లి హుండీల ఆదాయం రూ.3.24 లక్షలు
రాజాం సిటీ: బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,24,800లు ఆదాయం వచ్చినట్టు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, సిబ్బంది, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఉష్ణతాపం నుంచి
ఉపశమనం కల్పిద్దాం
విజయనగరం అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 17వ తేదీ మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మండల, జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చేనెల రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో వేసవి నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల మూడో శనివారం ‘బీట్ ద హీట్’ పేరుతో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కియోస్క్‌లపై కూటమి నిర్లక్ష్యం
విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి సచివాలయంలో రైతులకు సేవలందించిన కియోస్క్ యంత్రాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాల కోసం ఇండెంట్ పెట్టేందుకు ఉపయోగపడే యంత్రాలు ఇప్పుడు వినియోగంలేక మూలకు చేరుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుసేవా కేంద్రాల్లో ఉన్న 505 కియోస్క్ యంత్రాల్లో 125 మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామారావు వద్ద ప్రస్తావించగా రైతు సేవా కేంద్రాల్లో పాడైన కియోస్క్‌ల విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాగుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పోలిపల్లి పైడితల్లి హుండీల ఆదాయం రూ.3.24 లక్షలు

పోలిపల్లి పైడితల్లి హుండీల ఆదాయం రూ.3.24 లక్షలు