
అవగాహన పెంచిన మాక్‌డ్రిల్
విజయనగరం క్రైమ్:
సునామీ, హుద్‌హుద్ తుఫాన్, యుద్ధం వంటి అనుకోని దుస్సంఘటనలు ఎదురైన సమయంలో ప్రజలు తమను తాము రక్షించుకునే చర్యలపై విపత్తుల నివారణశాఖ మంగళవారం మాక్‌డ్రిల్ రూపంలో అవగాహన కల్పించింది. దీనికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను వేదికగా చేసుకుంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్, వైద్యారోగ్యశాఖలు సంయుక్తంగా మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాక్‌డ్రిల్ నిర్వహించాయి. అప్పుడే కాంప్లెక్స్‌కు వచ్చిన ప్రయాణికులు ఏదో జరిగిపోతోందని కంగారు పడ్డారు. విషయం తెలుసుకున్నాక వీక్షించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డిస్పెన్సరీ భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారి పొగలు రావడం చూసి అక్కడే బస్‌పాస్ కౌంటర్ వద్ద ఉన్న ఓ స్టూడెంట్ ఒక్కసారిగా కేకలు పెట్టసాగాడు. హుటాహుటిన ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాస్‌లు అప్రమత్తమై తొలుత స్థానిక వన్‌టౌన్ పోలీసులకు, తర్వాత అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారు. రెండువ్యాన్లతో ఘట నా స్థలికి అగ్ని మాపక సిబ్బంది చేరకుని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. ఒక ప్లటూన్ సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. అటు అగ్నిమాపక శాఖ తొలుత బిల్డింగ్‌లోని రెండో అంతస్తులోకి వెళ్లి మంటలను నిలుపుదల చేశారు. అంతలోనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందం.. పెద్ద పెద్ద నిచ్చెనలు వేసుకుని మంటలలో చిక్కకున్న క్షతగాత్రులను ఆగమేఘాలమీద బయటకు తీసుకొచ్చారు. ఆర్టీసీ అధికారుల సమాచారం మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు నాలుగు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాదాపు గంటనర్నసేపు మూడు శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగి అగ్నికీలలు వ్యాపించకుండా.. గాయపడిన వారికి అక్కడిక్కడే అత్యవసర చికిత్స అందించే సనివేశాలను రక్తికట్టించారు. జిల్లా విపత్తుల శాఖ మేనేజర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో సాగిన మాక్ డ్రిల్‌ను జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ దాట్ల కీర్తి, వీఎంసీ కమిషనర్ నల్లనయ్య, డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్‌సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్, ఫైర్ శాఖ అధికారి సోమేశ్వరరావు ఆసక్తిగా తిలకించారు.

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్

అవగాహన పెంచిన మాక్‌డ్రిల్