
79.13
–8లో
ఉపాధి వేతన బకాయిలు
కోట్లు
రూ.
రీసర్వేలో పక్కాగా
సరిహద్దులు నిర్ణయించాలి
భూముల రీ సర్వేతో భూ సమస్యలు తొలగి రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్
ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులు, ఉద్యోగులకు గడ్డు పరిస్థితి. ఎండలో పనిచేస్తున్నా వేతనదారులకు వేతనాలు అందడం లేదు. ఉద్యోగులనూ మూడు నెలలుగా వేతన టెన్షన్ వీడడంలేదు. మినీగోకులాలు నిర్మించిన రైతులకు, వివిధ సిమెంట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు భారంగా మారాయి. చేసిన పనికి వేతనం చెల్లించకపోవడంపై వేతనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జాప్యం ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేసిన వారం రోజులకే వేతనాలు చెల్లించేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలయ్యాయంటూ వాపోతున్నారు.
వేతనం కోసం ఎదురుచూపు..
జిల్లాలో 3.85 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది వేతనదారులు దశలవారీగా పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి రూ.79.13 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. నెలల తరబడి చెల్లించకపోవడంతో వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. జీవనానికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
మినీ గోకులాలు నిర్మించినా అందని బిల్లులు
జిల్లాలో మినీగోకులాలు నిర్మించిన వారికి కూడా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో సుమారు 1100కు పైగా మినీ గోకులాలు నిర్మించారు. వారికి రూ.11.13 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అలాగే, ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు, మెటల్ రోడ్లు వంటివి నిర్మించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. మెటీరియల్ వర్క్స్‌కు సంబంధించి రూ.102.25 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కొత్త పనులు చేసేందుకు ముందుకురావడం లేదు.
నిధులు విడుదల కాలేదు..
డ్వామా ఉద్యోగులకు 3 నెలలు జీతాలు రావాల్సి ఉంది. వేతనదారులకు, మినిగోకులాలకు, మెటిరీయల్ వర్క్స్ బకాయిల చెల్లింపునకు నిధులు విడుదల కావాల్సి ఉంది.
– ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా
వేతనదారులకు వేతన కష్టాలు
ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు లేవు
మినీ గోకులాల బకాయిలు
రూ.11.13 కోట్లు
మెటీరియల్ వర్క్స్ బకాయిలు రూ.102.25 కోట్లు

79.13