
కొత్త రేషన్‌కార్డుల మంజూరులో మెలిక
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 90 వేలకు పైగా అర్హులు ఉన్నా కార్డులు అందని పరిస్థితి. ఇటీవల కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చినా అమల్లో సాధ్యం కాలేదు. వీటికి విధించిన నిబంధనలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉచిత సిలిండర్ అని చెప్పి, లబ్ధిదారులు చెల్లించిన నగదు వారి ఖాతాల్లో జమకాకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలిలో కలిసిపోయాయి.