
● చెట్టంత నిర్లక్ష్యం..
చిత్రంలో రోడ్డు మధ్యలో తాటిచెట్టు, బోరును చూశారా... రోడ్డు మధ్యలో ఉన్నవాటిని తొలగించకుండా రోడ్డు వేయడం ఏమిటని ఆశ్యర్యపోతున్నారా.. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి జాతీయ రహదారి నుంచి వేసిన సీసీ రోడ్డు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును, బోరును తొలగించకుండా రోడ్డు నిర్మించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రోజ్‌లీనా వద్ద ప్రస్తావించగా త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పుకొచ్చారు. – గజపతినగరం రూరల్

● చెట్టంత నిర్లక్ష్యం..