
నేనే.. జిల్లా బాస్..!
విజయనగరం అర్బన్: శాఖాపరమైన ఎలాంటి అభివృద్ధి పనులకై నా ప్రజాప్రతినిధులను ఆహ్వానించే ముందుకానీ, మీరు వారిని ఇంకే కారణంతోనైనా కలవాలన్నా విధిగా తన అనుమతి తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అయినా, ప్రజాప్రతినిధులైనా పిలిస్తే వెళ్లేముందు తన అనుమతి విధిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇటీవల వ్యవహరించిన సమగ్ర శిక్ష ఏపీసీ, వ్యవసాయశాఖ జిల్లా అధికారులపై ఆగ్రహించారు.
జిల్లా బాస్‌ను నేనే.. నన్ను దాటి ఎవరైనా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను హింసిస్తుండడం వల్లే ఇటీవల పలువురు జిల్లా అధికారులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారని కొంతమంది జిల్లా అధికారులే చెప్పినట్లు డీఆర్‌ఓకు మంత్రి చెప్పారని, ఈ మేరకు ప్రచారం చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఎవరికీ సెలవులు ఇవ్వనని, తన అనుమతి లేకుండా సెలవులు తీసుకున్నవారిపై వేటు తప్పదని స్పష్టం చేశారు.
నా అనుమతి లేనిదే ప్రజాప్రతినిధులను కలవొద్దు
జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు