బాడంగి: మండలంలోని బొత్సవానివలస వద్ద చెరకు బెల్లంక్రషర్‌లో పని చేస్తున్న కార్మికుడు ఏడువాక రామ్‌కుమార్(25)విద్యుత్‌షాక్‌కు గురై సోమవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం డబ్బిరాజుపేటకు చెందిన రామ్‌కుమార్ పెద్దాపురం మండలం తాడిపత్రికి చెందిన బెల్లంక్రషర్ యజమానివద్ద పనిచేస్తున్నాడు. క్రషర్ ఆట ముగియడంతో క్రషర్‌కు సంబంధించిన సామగ్రిని రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐషర్‌వ్యాన్‌లో లోడ్‌చేస్తుండగా వ్యాన్‌పై ఉన్న విద్యుత్ హైటెన్షన్‌వైర్లు కనిపించకపోవడంతో అవి రామ్‌కుమార్ చేతికి తగలగా షాక్‌కు గురయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించగా డాక్టర్ ప్రత్యూష తనిఖీ చేసి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచినట్టు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. మృతుని కుటుంబానికి సమాచారం అందించామని వారు వచ్చాక కేసు నమోదుచేసి పోస్టుమార్టం మంగళవారం నిర్వహిస్తామని చెప్పారు.