జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Mar 12 2025 7:18 AM | Updated on Mar 12 2025 7:15 AM

నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్‌.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.

అంతర రాష్ట్ర ఫెన్సింగ్‌

క్రీడలకు విద్యార్థి ఎంపిక

విజయనగరం అర్బన్‌: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్‌ క్రీడలో అంతర్‌ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థి మద్దిల మోహనకృష్ణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 14వ తేదీ నుంచి కడప జిల్లాలో జరిగే ఉమ్మడి బాలబాలికల చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొంటాడు. మోహనకృష్ణను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రేవల్ల ఆదినారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు నడిపేన సూర్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

ఇంటి స్థలం కోసం తల్లి, సోదరుడిపై దాడి

విజయనగరం క్రైమ్‌: విజయనగరం మండలంలోని ముడిదాంలో ఇంటి జాగా కోసం కన్నతల్లిపైనే దాడి చేశాడు ఓ మాజీ ఆర్మీ జవాన్‌. అలాగే అడ్డువచ్చిన అన్నపైన కూడా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్సై అశోక్‌ మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ముడిదాంకు చెందిన మజ్జి పైడితల్లికి ఇద్దరు కొడుకులు. చాలా రోజుల నుంచి ఇంటి జాగాపై అన్న దమ్ముల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆ తగాదా తారస్థాయికి చేరడంతో చిన్నకొడుకు, మాజీ సైనికుడు మజ్జి శివ దుశ్చర్యకు దిగాడు. తనకు ఇంటి జాగా ఇవ్వడం లేదని తల్లి, అన్న కలిసి అన్యాయం చేశారంటూ తల్లి, సోదరుడిపైనే దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న ఓ ఆయుధంతో దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సమీప బంధువు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అశోక్‌ హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. గాయాలపాలైన అందరినీ విజయనగరం సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అన్నపై దాడికి పాల్పడిన మాజీ ఆర్మీ జవాన్‌పై అన్న తాలూకా వారు దాడికి దిగడంతో శివ కూడా హాస్పిటల్‌ పాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు1
1/2

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు2
2/2

జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement