
సోమవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2023
సాక్షి ప్రతిభా పరీక్షకు స్పందన
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలి కితీసేందుకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బి, మ్యాథ్ బి ప్రతిభా పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. –8లో
ఇదేం ‘చీడ’ బాబోయ్..!
ఆరుగాలం కష్టపడినా అన్నదాతకు కాలం కలసి రావడంలేదు. కూరగాయల రైతులకు ప్రకృతి సహకరించడం లేదు.
–8లో
విజయనగరం:
క్రీడలు... శారీరక, మానిసిక ఆరోగ్యానికి దోహ దపడతాయి. వినోదాన్ని పంచుతాయి. యువతకు కొత్త ఉత్సాహాన్నిచ్చి.. పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు జిల్లా యంత్రాంగం చురు గ్గా సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభు త్వం గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈనెల 15 నుంచి అతిపెద్ద క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టనుంది. మొత్తం 5 క్రీడాంశాల్లో 51 రోజుల పాటు సచివాల య స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించనుండగా.. సచివాలయ స్థాయిలో నిర్వహించే పోటీలకు సంబంధించిన జట్లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
626 సచివాలయాల్లో క్రీడా పోటీలు
రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల వ్యయంతో నిర్వహిస్తోన్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు విజయనగరం జిల్లాలో ఈ నెల 15 నుంచి 626 సచివాలయాలు వేదికగా ప్రారంభంకానున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వాలీబాల్ క్రీడాంశంలో ఒక జట్టులో 12 మంది, కబడ్డీ జట్టులో 12 మంది, ఖోఖో జట్టులో 15 మంది, క్రికెట్ జట్టులో 16 మంది, బ్యాడ్మింటన్ జట్టులో ఇద్దరు క్రీడాకారులు ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 15 నుంచి జనవరి 1వ తేదీ వరకు 18 రోజుల పాటు సచివాలయ స్థాయిలోను, జనవరి 2 నుంచి 15వ తేదీ వరకు 14 రోజుల పాటు మండల స్థాయిలో, జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 22 నుంచి 28వ తేదీ వరకు 7 రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతలకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు పంపిస్తారు.
క్రీడా సామగ్రి, మైదానాలు సిద్ధం
ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు సిద్ధమయ్యాయి. పోటీల్లో తలపడే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే... రాష్ట్ర ప్రభుత్వం పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి పంపిణీని ఇప్పటికే పూర్తి చేసింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా విజయనగరం జిల్లాలోని 626 సచివాలయాలకు సామగ్రిని సరఫరా చేసింది. పోటీల్లో విజేతలకు ప్రదానం చేసేందుకు 240 ట్రోఫీలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. క్రీడాకారులకు అందజేసేందుకు 2,736 మెడల్స్, 2,736 సర్టిఫికెట్లు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 320 మైదానాలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు గుర్తించారు. ఆయా మైదానాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
13 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నెల 13తో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో 92,000 మంది 5 క్రీడాంశాల్లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. రానున్న 4 రోజుల్లో క్రీడాకారుల సంఖ్య లక్షకు పైగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి పోటీల క్రీడా సామగ్రిని ఆవిష్కరిస్తున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డీఎస్‌డీఓ అచ్యుతరావు తదితరులు
రాష్ట్రంలో వైద్య రంగానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది.
ప్రజారోగ్యమే మహాభాగ్యం అనే భావనతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ
ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడి పెరిగింది.
● సర్వజన ఆస్పత్రిపై ప్రజల్లో పెరిగిన నమ్మకం
● ఏడాదికి 3.70 లక్షల మంది వరకు వైద్య సేవలు
● ఏడాదికి 45 వేల మంది ఇన్‌పేషంట్లకు చికిత్స
● 5 లక్షలకు పైగా వైద్య పరీక్షలు
● 5 వేల వరకు మేజర్ ఆపరేషన్లు
● అన్ని విభాగాల్లో నాణ్యమైన వైద్య సేవలు
న్యూస్‌రీల్
సేవలు మెరుగు
సర్వజన ఆస్పత్రిలో..
ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరానికి చురుగ్గా సన్నాహాలు
ఈ నెల 15 నుంచి 626
సచివాలయాల్లో క్రీడా పోటీలు
5 క్రీడాంశాల్లో 51 రోజులపాటు
జరగనున్న క్రీడా సంబరం
పోటీల నిర్వహణకు 320
క్రీడా మైదానాలు గుర్తింపు
సచివాలయాలకు చేరుకున్న
క్రీడా సామగ్రి
ఈ నెల 13తో ముగియనున్న క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న 90 వేల మంది క్రీడాకారులు
అందరి సహకారంతో విజయవంతం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను అందరి సహకారంతో విజయవంతం చేసేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని 626 సచివాలయాల్లో మొదటి దశలో పోటీలు నిర్వహించిన అనంతరం మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం. పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి పంపిణీ పూర్తి చేశాం.
– బి.రామ్‌గోపాల్,
సీఈఓ సెట్విజ్, విజయనగరం
నగదు ప్రోత్సాహకాలు ఇలా...
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజేతలుగా నిలి చిన క్రీడాకారులకు మొత్తంగా రూ.12 కోట్ల మొత్తా న్ని అందజేయనుంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన మొదటి మూడు జట్లకు రూ.35వేలు, రూ.15వేలు, రూ.5వేలు, జిల్లా స్థాయి విజేతలకు రూ.60వేలు, రూ.30వేలు, రూ.10వేలు, రాష్ట్ర స్థాయిలోని మొదటి ముగ్గురు విజేతలకు రూ.5లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు చొప్పున అందజేయనున్నారు. బ్యాడ్మింటన్ పోటీ ల్లో విజేతలకు నియోజకవర్గ స్థాయిలో మొదటి మొదటి మూడు విజేత జట్లకు రూ.20వేలు, రూ. 10, రూ.5వేలు, జిల్లా స్థాయిలో రూ.35వేలు, రూ. 20వేలు, రూ.10వేలు, రాష్ట్ర స్థాయి విజేతలకు రూ. 2లక్షలు, రూ.1లక్ష, రూ.50వేలు చొప్పున బహుమతులు ప్రదానం చేస్తారు.

ఆడుదాం ఆంధ్రా లోగో

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల నిర్వహణకు ఇచ్చిన క్రీడా సామగ్రి

మాట్లాడుతున్న సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ చౌదరి
