చికెన్‌

సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు - Sakshi

పిడుగుపాటుకు గురై

మహిళకు తీవ్ర అస్వస్థత

తెర్లాం: తెర్లాం మండలం, నందబలగ గ్రామానికి చెందిన గుల్లిపల్లి సావిత్రి పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె పొలంలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో దగ్గరలో పిడుగు పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పక్కనే పొలం పనులు చేస్తున్న కొంతమంది వచ్చి చూసి 108 వాహనానికి సమాచారం అందించగా ఈఎంటీ బోను వెంకటరమణ, పైలట్‌ అమరా రాజేష్‌ హుటాహుటిన వాహనంతో వచ్చి పిడుగుపాటుకు గురైన మహిళకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యసేవల నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు.

వేడుకగా సామూహిక అక్షరాభ్యాసం

విజయనగరం టౌన్‌: స్థానిక పద్మావతినగర్‌లో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసాన్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ, కార్యదర్శి శ్రీరామ్‌ల నేతృత్వంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మంది చిన్నారులు అక్షరాభ్యాసంలో పాల్గొనడం విశేషమని నిర్వాహకులు ఈ సందర్భంగా సంతృప్తి వెలిబుచ్చారు. చిన్నారులకు కావాల్సిన సామగ్రిని ఉచితంగా అసోసియేషన్‌ పంపిణీ చేసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తరించారు.

ఫొటోఫ్రేమ్‌ షాపు దగ్ధం

విజయనగరం క్రైమ్‌: స్థానిక వైష్ణవ వీధిలో గల వైష్ణవి ఫొటోఫ్రేమ్‌ వర్కింగ్‌ షాపు ఆదివారం వేకువజామున అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. షాపులో వెంటిలేషన్‌ లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ప్రమాదంలో సుమారు రూ. 9 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించిందని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి వి.సోమేశ్వరరావు తెలిపారు.

పిడుగుపాటుతో

11 గొర్రెల మృతి

మక్కువ: మండలంలోని విజయరామపురం గ్రామ సమీపంలో మేత మేస్తున్న 11 గొర్రెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొర్రెల మంద మేత మేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే 11 మేకలు మృతి చెందాయి. ఈ విషయంలో అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోన గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు వెంకటరమణ, సత్యం కోరుతున్నారు.

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ133 శ్రీ236 శ్రీ 246

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top