రైతు రాజుగా ఉండాలన్నదే ధ్యేయం | Sakshi
Sakshi News home page

రైతు రాజుగా ఉండాలన్నదే ధ్యేయం

Published Sat, Jun 3 2023 1:22 AM

ట్రాక్టర్‌ మెగా తాళాన్ని రైతు గ్రూపునకు అందజేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: రైతు రాజుగా ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆకాంక్షించేవారని, ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు అవసరాలు తీర్చడమే ధ్యేయంగా పనిచేస్తు న్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చుతున్నారన్నారు. విజయనగరం కోట వద్ద వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో భాగంగా 123 ట్రాక్టర్లను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దుక్కి దున్నే ట్రాక్టర్ల నుంచి కోత యంత్రాల వరకు రైతులకు రాయితీపై అందజేస్తోందని తెలిపారు.

● జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్కో రైతు భరోసా కేంద్రానికి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. దీనివల్ల రైతులకు అద్దె కష్టాలు తప్పుతాయని, సాగు సులభమవుతుందని పే ర్కొన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఉచిత విద్యుత్‌ గురించి తీగెలపై దుస్తులు ఆరబెట్టుకోవాలంటూ అపహేలనగా మాట్లాడేవారన్నారు. ప్రస్తుత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రైతులకు 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోందని తెలిపారు.

● కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. రైతులకు తక్కువ ధరకే యంత్రాలు సమకూర్చుతోందని చెప్పారు. ఖరీఫ్‌ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. పురుగు మందును డ్రోన్లతో పిచికారీ చేయడంపై 20 మందిని శిక్షణకు పంపించామన్నారు. గత ఏడాది 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు.

● ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లడుతూ చంద్రబాబు వ్యవసాయం దండగఅంటే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పండగలా మార్చారన్నారు. రాష్ట్రంలో 15 వేల సచివా లయాలను ఏర్పాటు చేసి, రైతులకు సేవలందించేలా ప్రతి సచివాలయానికి ఒక గ్రామ వ్యవసాయ సహాయకుడిని నియమించారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వెంపాడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, డీసీసీబీ చైర్మన్‌ వేచలపు వెంకట చిన రామునాయుడు, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అవనాపుభావన, సహాయ కలెక్టర్‌ త్రివినాగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు తదిత రులు పాల్గొన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

బొత్స సత్యనారాయణ

యంత్ర సేవా మెగా మేళాలో

రూ.15.2 కోట్ల విలువైన యంత్రాల పంపీణీ

జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించిన మంత్రి బొత్స

Advertisement
Advertisement