అత్తమామల వేధింపులు... అల్లుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అత్తమామల వేధింపులు... అల్లుడి ఆత్మహత్యాయత్నం

May 16 2023 11:37 AM | Updated on May 16 2023 11:37 AM

- - Sakshi

ప్రతాప్‌ అత్మవారి ఇంటిలోనే భార్యా,పిల్లలతో కొన్నేళ్లుగా ఉంటున్నాడు.

పార్వతీపురం: అత్తమామలు వేధిస్తున్నారని మనస్తాపం చెందిన అల్లుడు పార్వతీపురం పట్టణానికి చెందిన జి.ప్రతాప్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మేరకు సోమవారం ఆస్పత్రి అవుట్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెయింటర్‌గా పనిచేస్తున్న ప్రతాప్‌ అత్మవారి ఇంటిలోనే భార్యా,పిల్లలతో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. కలిసి ఉన్న సమయంలో అత్తమామలు ప్రతాప్‌తో రూ.5లక్షలు అప్పు చేయించారు. ఆ అప్పు విషయమై కొద్ది రోజులనుంచి అత్తమమాలతో గొడవ పడి వారింటి దగ్గర భార్యాపిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి ప్రతాప్‌ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి పురుగు మందు తాగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు, బంధువులు చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పురుగుల మందుతాగి వృద్ధుడు..
పార్వతీపురం:
మతిస్థిమితం లేక ఓ వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామానికి చెందిన ఎం.అప్పలనాయుడికి మద్యం తాగే అలవాటుంది. కొద్దిరోజులనుంచి మతిస్థిమితం కూడా లేదు. మద్యం మత్తులో ఉన్న అప్పలనాయుడు సోమవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంటిలో ఉన్న పురుగు మందును తాగాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు గమనించి చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement