
విజయనగరం: మండలంలోని నేరడి–బి గ్రామానికి చెందిన విద్యార్థిని అడ్డసారి రాజుకుమారి(15) ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఇంట్లో ఎలుకలు మందు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు భామిని పీహెచ్‌సీకి, పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
రిమ్స్‌లో చికిత్స పొందుతూ విద్యార్థిని మృత్యువాత పడినట్లు కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. కొత్తూరు ప్రభుత్వ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న రాజుకుమారి ఇటీవల జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్ సక్రమంగా రాయలేకపోయానని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అడ్డసారి మహాలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వై.అమ్మాన్‌రావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.