
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ అవనాపు భావన
విజయనగరం ఫోర్ట్: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదా యం సమకూరుతుందని, యువత ఆ దిశగా అడుగులు వేయాలని డీసీఎంఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ అవనాపు భావన పిలుపునిచ్చారు. స్థానిక డీసీఎంఎస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మహాజన సభలో ఆమె మాట్లాడారు. అందరి సహకారంతో డీసీఎంఎస్ లాభాలబాటలో పయనిస్తోందన్నారు. గత ఏడాది రూ.19 కోట్ల టర్నోవర్ సాధిస్తే, ఈ ఏడాది రూ.21 కోట్ల టర్నోవర్ సాధించామని తెలిపారు. డీసీఎంఎస్ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామునాయుడు, వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ, తదిత రులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ చైర్‌పర్సన్
డాక్టర్ అవనాపు భావన