ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆరుగురికి గాయాలు

Mar 27 2023 1:30 AM | Updated on Mar 27 2023 1:30 AM

ప్రమాదంలో  నుజ్జునుజ్జయిన ఆటో, ద్విచక్రవాహనం  - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో, ద్విచక్రవాహనం

పాలకొండ రూరల్‌: మండలంలోని వెలగవాడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పాలకొండకు చెందిన సవర ఆదినారాయణ తన ద్విచక్రవాహనంపై సీతంపేట మండలం నారాయణ గూడకు వెళ్తుండగా ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆదినారాయణతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న పి.గౌరీశ్వరరావు, పి.లక్ష్మి, డి.లక్ష్మి, ఎ.సత్యనారాయణ, పి.భవాని గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదినాయణతోపాటు మరోఇద్దరిని మెరుగైన వైద్య సేవలకోసం శ్రీకాకుళం రిఫర్‌ చేశారు. ఈ ఘటనపై ఎస్సై బి.శివప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement