
పార్వతీపురం: భార్య గొడవపడి కన్నవారింటికి పిల్లలతో కలిసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త బ్లేడుతో కోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన రొక్కం అచ్యుతరావు భార్య అరుణ గొడవపడి పిల్లలతో కలిసి నెలరోజుల క్రితం కన్నవారి ఊరు కొప్పర కొత్తవలస గ్రామానికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై బ్లేడుతో మెడ, చేతులమీద కోసుకున్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు 108 వాహనంద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
పురుగుమందు తాగి అస్వస్థత
పార్వతీపురం: కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున పురుగుమందు తాగడంతో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి గ్రామానికి చెందిన బిడ్డిక పాపారావు జీడితోటలో పనిచేసుకుంటుండగా భార్య స్వర్ణ జీడితోటకు కొట్టేందుకు పురుగుమందు బాటిల్స్ తెచ్చింది. అయితే అవి కూల్‌డ్రింక్ బాటిల్ అనుకుని పాపారావు పొరపాటున తాగాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కుటుంబసభ్యుల సహకారంతో చికిత్సకోసం జీఎల్ పురం ప్రభుత్వ ఆస్పత్రికి భర్తను తరలించింది. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించిన తరువాత మెరుగైన వైద్యంకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
పనస పసందు
వజ్రపుకొత్తూరు: పనస రైతుల పంట పండింది. పనస కాయలు గుత్తులు గుత్తులుగా కాయడంతో పాటు మంచి ధర కూడా లభిస్తోంది. ఉద్దానం గోపినాథపురంలోని రైతు కర్ని వల్లయ్య కొబ్బరితోటలో అంతర పంటగా పండిస్తున్న పసస చెట్టుకు ఇలా 168 కాయలు కాశాయి.

చికిత్స పొందుతున్న అచ్యుతరావు