
పైడితల్లి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేస్తున్న నాలుగెస్సుల రాజు, తదితరులు
విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 25వ వార్షికోత్సవం 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించడానికి నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సంస్ధ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.సూర్యపాత్రో ఆధ్వర్యంలో స్థానిక నర్తనశాల అకాడమీలో ఆదివారం అమ్మవారి చిత్రపటానికి పూలమాలలేసి, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకున్నారు. సంస్ధ వార్షికోత్సవానికి సభ్యులందరూ పూర్తి స్ధాయిలో కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు రాజు, ఎస్.అచ్చిరెడ్డి, బంగార నాగ ప్రకాశ్, పీవీవీఏవీఎస్.భానురాజా, కొమ్ము కనకారావ్, భేరి రాధికారాణి, సామవేదుల గీతారాణి సిస్టర్స్, తాడి వీర్రాజు, స్వప్న హైందవి తదితరులు పాల్గొన్నారు.