ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకర్ నాగపూర్‌లోని వీఆర్‌సీ నుంచి మెటలర్జీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1991లో సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన హెచ్‌ఆర్, మార్కెటింగ్‌ల్లో ఎంబీఏ పూర్తి చేశారు. వివిధ ఆపరేషన్ల యూనిట్లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన 2025 ఫిబ్రవరి 1న ఎన్.ఎస్.ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ఆయన నాయకత్వంలో సంస్థ రేటెడ్ కెపాసిటీకి దగ్గరగా కార్యకలాపాలను స్థిరీకరించడం, సాంకేతిక–ఆర్థిక అంశాల్లో గణనీయమైన మెరుగుదల, ఉత్పాదకతను పెంచడం జరిగింది. ఈ తరుణంలో ఆయన స్టీల్‌ప్లాంట్ సీఎండీగా నియమితులయ్యారు.


