మహారాణిపేట : ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా మహారాణిపేటలోని రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్‌కు నివాళులర్పించిన ఆమె, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 50కి పైగా సార్లు రక్తదానం చేసిన 25 మంది ప్లాటినం దాతలను ఆమె సత్కరించారు. పేదలకు అందుబాటు ధరల్లో పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జనతా రేట్ల’ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను పరిశీలించి, తలసేమియా చిన్నారులతో ముచ్చటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం చైర్మన్ సి హెచ్.బలసతీష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఐఆర్‌సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ పట్నాయక్, ఎండి. రెహమ్‌తుల్లా, నరవ ప్రకాష్ రావు, జి.ప్రసాద్ రావు, విష్ణువర్ధన రెడ్డి, ప్రొఫెసర్ హరనాథ్, పి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


