మహారాణిపేట : ప్రభుత్వం అందించే సేవలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ సన్నద్ధతపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ , క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నామని, అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని ఏ ప్లస్ ర్యాంకు సాధించేలా లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ శాఖల వారీగా డేటా ఎంట్రీని సక్రమంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ర అధికారులు పాల్గొన్నారు.


