● భుజాన మోస్తూ.. బండిపై తీసుకెళ్తూ..
మారని వాహనదారుల తీరు
● ప్రాణమా.. ఫోనా?
● సుర్రుమంటున్న సూరీడు
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. అత్యవసర పనుల మీద గడప దాటి బయటకు వస్తే చాలు.. సూరీడు సుర్రుమనిపిస్తూ మంట పుట్టిస్తున్నాడు. ఎండ తీవ్రతకు, ఉక్కపోతకు నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మండుటెండల బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎండ దెబ్బ, వడగాల్పుల నుంచి రక్షణ పొందేందుకు మహిళలు ముఖానికి పూర్తిగా చున్నీలు, స్కార్ఫ్‌లు కప్పుకుని బయటకు వస్తున్నారు.ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా ఎండ తగలకుండా జాగ్రత్త పడుతున్న దృశ్యాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి.


