అరకుకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

అరకుకు ప్రత్యేక రైళ్లు

Oct 31 2025 7:21 AM | Updated on Oct 31 2025 7:21 AM

అరకుకు ప్రత్యేక రైళ్లు

అరకుకు ప్రత్యేక రైళ్లు

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు.

● అరకు–యళ్లహంక(08551) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నవంబరు 13, 23వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08552) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నవబంరు 14, 24వ తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటకు యళ్లహంకలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్‌.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్‌లలో ఆగుతాయి.

● అరకు–యళ్లహంక(08555) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నవంబరు 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08556) స్పెషల్‌ రైలు నవబంరు 18, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి యళ్లహంకలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్‌.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్‌లలో ఆగుతాయి.

● శ్రీకాకుళం రోడ్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ (08553) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నవంబరు 21న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.05 గంటలకు విశాఖపట్నం, మరుసటిరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌–శ్రీకాకుళం రోడ్‌ (08554) స్పెషల్‌ రైలు నవంబరు 24వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌లో బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం, అదేరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.

● భువనేశ్వర్‌–బెంగళూరు కంటోన్మెంట్‌ (08463) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నవంబరు 16వ తేదీ ఉదయం 6.15 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు మధ్యాహ్నం 11.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్‌–భువనేశ్వర్‌ (08464) స్పెషల్‌ రైలు నవంబరు 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2గంటలకు దువ్వాడకు, అదేరోజు ఉదయం 10.15గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement