 
															వరదనీటిలో స్వయంభూ లింగం
●ముంపునకు గురైన వామలింగేశ్వర ఆలయం
వరదనీటితో నిండిన వామలింగేశ్వర ఆలయం, (ఇన్‌సెట్) వరద నీటి మధ్యలో దర్శనమిస్తున్న స్వయంభూ లింగం
మాకవరపాలెం: పెద్దమిల్లు జంక్షన్‌లో ఉన్న వామలింగేశ్వరాలయం వరద నీటిలో చిక్కుకుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఆలయంలో లోపలకు భారీగా నీరు చేరింది. ఆలయ ఆవరణే కాకుండా గర్భగుడిలో ఉన్న స్వయంభూ లింగం సైతం నీట మునిగింది. దీంతో కార్తీక మాసంలో జరిగే నిత్య పూజలకు అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినపుడల్లా ఆలయం పక్కనే ఉన్న జంగం గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు ఈ గెడ్డ నుంచి వెళ్లే వరదనీటి కారణంగా ఈ ఆలయం ముంపునకు గురైంది. చాలాకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
							వరదనీటిలో స్వయంభూ లింగం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
